Monday 31st August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘200 కంపెనీలకు ఈ-మెయిళ్లు..ఇది వైసీపీ కుట్ర’

‘200 కంపెనీలకు ఈ-మెయిళ్లు..ఇది వైసీపీ కుట్ర’

Cm Chandrababu News Latest | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వైసీపీ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.

బుధవారం అమరావతిలో కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను అడ్డుకునేందుకు జగన్ పార్టీ కుట్ర చేస్తుందని, ఏపీఎండీసీ లో పెట్టుబడులు పెట్టవద్దని సుమారు 200 కంపెనీలకు ఈ-మెయిళ్లు పంపారని పయ్యావుల పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుపడుతుందని ఆరోపిస్తూ..ఈ-మెయిళ్లు పంపిన అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ కుట్రలు చేస్తుందని దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

కాగా ఈ-మెయిళ్ల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎలా స్పందిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions