Thursday 22nd October 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఇదేం పైత్యం..చనిపోయిన పోప్ అవతారంలో ట్రంప్’

‘ఇదేం పైత్యం..చనిపోయిన పోప్ అవతారంలో ట్రంప్’

US President’s Papal Avatar Goes Viral | అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో తాజగా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో కన్నుమూసిన విషయం తెల్సిందే. తదుపరి పోప్ ఎవరనేదానిపై సందిగ్దత నెలకొంది.

కాథలిక్ చర్చికి కొత్త పోప్‌ను ఎన్నుకునే సమావేశం గురించి ప్రస్తావన వచ్చిన క్రమంలో తదుపరి పోప్ ఎవరు కావచ్చు అని మీడియా ట్రంప్ ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ట్రంప్ తానే పోప్ అయితే బాగుంటుందని, ఇదే తన నెంబర్ వన్ ఛాయిస్ అని బదులిచ్చారు.

ట్రంప్ సరదాగా ఈ కామెంట్స్ చేశారని అందరూ భావించారు. కానీ శనివారం డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అయిన ట్రూత్ లో పోప్ వేషధారణతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో రూపొందించిన ఫోటోను షేర్ చేశారు.

ఇది చూసిన పోప్ అభిమానులు ట్రంప్ ప్రవర్తనపై మండిపడుతున్నారు. దివంగత పోప్ ఫ్రాన్సిస్ ను అవమానించే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అలాగే ది వైట్ హౌస్ సోషల్ మీడియా ఖాతా నుండి కూడా ట్రంప్ ఏఐ ఫోటోను షేర్ చేయడం గమనార్హం.

You may also like
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ!
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions