Wednesday 23rd September 2026
12:07:03 PM
Home > తాజా > ‘విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయండి’

‘విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయండి’

vijay deverakonda

Vijay Devarakonda Latest News | ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహన్.

కోలీవుడ్ నటుడు సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా రెట్రో. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26న హైదరాబాద్ జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడారు.

అయితే ప్రసంగం చేసే సమయంలో ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు’ అంటూ పాకిస్థాన్ ను మరియు ఉగ్రవాదులను ఉద్దేశించి విజయ్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో విజయ్ మాటలు గిరిజన ప్రజల్ని అవమానించే విధంగా ఉన్నాయని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు.

గిరిజనుల్ని అవమానించే విధంగా ప్రసంగించిన విజయ్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ చౌహన్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions