Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!

మహిళా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్!

Metro

Hyd Metro New App | హైదరాబాద్ (Hyderabad) నగరానికి తలమానీకంగా ప్రయాణీకుల రవాణా అవసరాలు తీరుస్తున్న మెట్రో (Metro Rail) తాజాగా మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది.

అందులో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘TUTEM’ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. బిట్స్ పిలానీ-హైదరాబాద్, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ పోలీసు విభాగం, ఐఐటీ ఖరగ్ పూర్, ముంబయిలోని పలు సంస్థలు కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) సహకారంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాయి.

ఈ సందర్భంగా మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఇంటి నుంచీ గమ్యస్థానం వరకు సురక్షిత ప్రయాణం చేయడంలో ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ఎంతో సాయపడుతుందన్నారు. ‘TUTEM’ యాప్ మహిళా ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణ అనుభూతిని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. తమ ప్రయాణ వివరాలను మహిళలు తమ సన్నిహితులతో షేర్ చేసుకునే ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. ‘TUTEM’ యాప్ త్వరలో ప్రయాణికుల వినియోగానికి అందుబాటులోకి రానుంది. 

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!
Hyd నగరవాసులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions