Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

Ys Sharmila News | పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి మూలంగ జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

మోదీ సర్కార్ వైఫల్యం మూలంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ చేశారు. ఈ చౌకిదార్ ప్రభుత్వం అంటే మోదీ యొక్క కాపాలదారుడి ప్రభుత్వం సరిహద్దుల్ని రక్షించడంలో విఫలమయ్యిందని దుయ్యబట్టారు.

దేశ ప్రజలపై, అసమ్మతిని అణిచివేయడంలో, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు. ‘ ప్రధాని గారు, ఇదిగొండి లాఠీ. శత్రువులపైన దీన్ని వినియోగించండి, అంతేకాని భారత్ లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రక్షించేవారిపై మాత్రం కాదు’ అని షర్మిల పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions