Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు’

‘పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు’

‘Mera Yesu Yesu’ pastor Bajinder Singh sentenced to life | 2018లో జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన పాస్టర్ బజీందర్ సింగ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది పంజాబ్ లోని మొహాలీ కోర్టు.

హరియాణలో జన్మించిన బజీందర్ సింగ్ 2012లో ప్రార్థన సమావేశాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ‘మేరా యేసు యేసు’ ప్రసంగాలు, వివిధ రకాల వ్యాధులకు హీలింగ్ చేస్తూ చేసిన కార్యక్రమాలు విశేష ప్రాచుర్యం పొందాయి.

2012లో ప్రార్థన సమావేశాలు నిర్వహించడం ప్రారంభించాడు, మరియు “ప్రాఫెట్ భజిందర్ సింగ్ మినిస్ట్రీస్” పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. అయితే 2018లో పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన ఒక మహిళను అత్యాచారం చేసిన కేసులో బజీందర్ సింగ్ అరెస్టయ్యాడు.

ఈ కేసులో ఆమెను విదేశాలకు పంపుతానని ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం విచారణ చేపట్టిన న్యాయస్థానం 2025 మార్చి 28న దోషిగా తేల్చి, ఏప్రిల్ 1, 2025న జీవిత ఖైదు విధించింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions