Wednesday 4th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రిటైర్మెంట్ పై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు!

రిటైర్మెంట్ పై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు!

Rohit Sharma Comments on Retirement | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)ఫైనల్ లో టీం ఇండియా (Team India) విజేతగా నిలిచింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తుది పోరులు భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టోర్నీ ఆసాంతం ఉత్తమ ప్రదర్శన విజేతగా నిలవడం గొప్పగా ఉందని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని జరిగిన ప్రచారానికి హిట్ మ్యాన్ చెక్ పెట్టాడు.

భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించగా తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్లాన్లు లేవని సమాధానం ఇచ్చారు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని, వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడినవారికి ఇంకా ఆడాలని ఉంటుందన్నాడు. అయితే ఇది యువ ఆటగాళ్లపై ప్రభావం చూపుతుందన్నాడు.

You may also like
నా కుమార్తెను బ్రతికించండి..రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ
బీసీసీఐ షాకింగ్ నిర్ణయం?..’బీ గ్రేడ్’ లోకి రో-కో
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..కన్నీరు పెట్టుకున్న స్టార్ ప్లేయర్
‘ఫైనల్ కు ఆ బౌలర్ డౌటే !..టీం ఇండియాకు మంచి అవకాశం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions