Wednesday 6th May 2026
12:07:03 PM
Home > తాజా > లవ్ బ్రేకప్ అయిన వారికే మాత్రమే ఉద్యోగాలు

లవ్ బ్రేకప్ అయిన వారికే మాత్రమే ఉద్యోగాలు

Bengaluru Company Is Hiring For A ‘Chief Dating Officer’ | లవ్ ( Love ) కోసం మరియు ఉద్యోగాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. అలాంటిదే ఉద్యోగమే లవ్ కు సంబంధించినది అయితే, ఇలాంటి ఉద్యోగ అవకాశాన్ని ఓ సంస్థ కల్పిస్తోంది.

బెంగళూరుకు చెందిన టాప్ మెట్ ( Topmate ) అనే మెంటరింగ్ అండ్ కన్సల్టెంట్ సంస్థ చీఫ్ డేటింగ్ ఆఫీసర్ ( Chief Dating Officer ) పోస్ట్ కోసం చేసిన ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ మార్కెటింగ్ చీఫ్ నిమిష చంద ఈ ప్రకటన చేశారు.

ఈ పోస్ట్ కోసం విద్యార్హతలు అవసరం లేదని కానీ, లవ్ బ్రేకప్ ( Breakup ) అయ్యుండాలని కండీషన్స్ ( Conditions ) పెట్టారు. ఈ ఉద్యోగం కావాలనుకునే వారికి ప్రస్తుత డేటింగ్ ట్రెండ్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. మూడు డేట్లు ( Dates ), రెండు సిట్యుయేషన్ షిప్లు ( Situationship ), ఒక బ్రేకప్ జరిగి ఉండాలి.

ప్రూఫ్స్ ( Proofs ) మాత్రం అడగరు, కేవలం స్టోరీని మాత్రమే వింటారు. అంతేకాకుండా రెండు లేదా మూడు డేటింగ్ యాప్స్ ని వాడి ఉండాలి. ఘోస్టింగ్ వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలని టాప్ మేట్ సంస్థ స్పష్టం చేసింది. వైరల్ గా మారిన ఈ ప్రకటనపై నెటిజన్లు ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.

‘స్కూల్ లో చదువుతున్న రోజుల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చుని ఫ్లేమ్స్ ( Flames ) ద్వారా వేరే వాళ్ళని కలిపేవాడ్ని. నేను ఈ ఉద్యోగం కోసం అప్లై చేయొచ్చా’ అంటూ ఒక నెటిజన్ స్పందించారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions