Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > గ్రూప్ 1 పరీక్ష..కేటీఆర్ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు

గ్రూప్ 1 పరీక్ష..కేటీఆర్ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు

KTR On Group 1 Exam | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఇంటివద్ద పోలీసులు భారీగా మోహరించారు. గ్రూప్ 1 పరీక్ష సోమవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో గ్రూప్ పరీక్షా అభ్యర్థులతో కలిసి కేటీఆర్ ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అశోక్ నగర్ ( Ashok Nagar )వెళ్తారనే అనుమానంతో పోలీసులు నందినగర్ ( Nandi Nagar ) లోని కేటీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.

ఈ క్రమంలో తాను ఏమైనా దొంగతనానికి వెళ్తున్నానా అంటూ కేటీఆర్ పోలీసులను ప్రశ్నించారు. అశోక్ నగర్ వెళ్ళాలి అనుకుంటే ముందుగానే సమాచారం ఇస్తానని కేటీఆర్ పోలీసులకు చెప్పారు. కేటీఆర్ తో పాటు మరికొంతమంది బీఆరెస్ నాయకుల ఇంటివద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions