Tuesday 16th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రధాని నివాసంలో ‘దీపజ్యోతి’..సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేశ్

ప్రధాని నివాసంలో ‘దీపజ్యోతి’..సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేశ్

Nara Lokesh Tweet on Modi with Punganur Cattle | ప్రధాని మోదీ ( Pm Modi ) దూడతో సరదాగా గడుపుతున్న వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ ( Minister Lokesh ) ఆనందం వ్యక్తం చేశారు.

కాగా ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికారిక నివాసం లో తల్లి ఆవు దూడ ( Calf )కు జన్మనిచ్చింది. దూడ నుదిటిపై కాంతి గుర్తుంది. దింతో సదరు దూడకు ‘దీపజ్యోతి’ ( Deepjyoti ) అని ప్రధాని నామకరణం చేశారు. తన నివాసంలోకి కొత్త అతిథి వచ్చిందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ప్రధాని దూడతో సరదాగా గడుపుతున్న వీడియో పై నారా లోకేశ్ స్పందించి, సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో హృదయానికి హత్తుకున్నట్లు చెప్పారు.

‘దీపజ్యోతి’ పుంగనూరు ( Punganuru ) జాతికి చెందిన దూడ అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు జాతి ఆవులకు ప్రసిద్ధి అని గుర్తుచేశారు. అలాగే ఏపీకి చెందిన ఆవు ప్రధాని నివాసంలో ఉండడం సంతోషాన్ని కలిగించిందని నారా లోకేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
దశాబ్దాల తర్వాత రాహుల్ గాంధీ చెంతకు తాత డ్రైవింగ్ లైసెన్సు
‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’
‘మోదీ జీ ఆయనకు భారత రత్న ఇచ్చి ఆశ్చర్యపరచండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions