Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది..ఓ నేత ఆఫర్ చేశారు

నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది..ఓ నేత ఆఫర్ చేశారు

Nitin Gadkari On Prime Minister Post Offer | కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, ఓ విపక్ష నేత తనకు ఆఫర్ ( Offer ) ఇచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు నాగపూర్ ( Nagpur ) లో శనివారం జరిగిన జర్నలిస్టు అవార్డ్స్ కు నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు చెప్పారు.

ప్రధాని రేసులో ఉంటే, తాము మద్దతు ఇస్తామని సదరు నాయకుడు చెప్పినట్లు గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఆ విపక్ష నాయకుడు ఎవరు ?..ఏ సమయంలో ఆఫర్ ఇచ్చారు అనే విషయాన్ని గడ్కరీ చెప్పలేదు.

కానీ తనకు ప్రధాని అవ్వడం లక్ష్యం కాదని, పదవుల కోసం సిద్ధాంతాల విషయంలో రాజీ పడేదే లేదని ఆఫర్ చేసిన నేతకు తాను స్పష్టం చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

‘ నాకు మద్దతు ఎందుకిస్తారు ?..మీ మద్దతును నేను ఎందుకు అంగీకరించాలని’ ప్రతిపక్ష నేతను ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు.

You may also like
దశాబ్దాల తర్వాత రాహుల్ గాంధీ చెంతకు తాత డ్రైవింగ్ లైసెన్సు
‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’
‘మోదీ జీ ఆయనకు భారత రత్న ఇచ్చి ఆశ్చర్యపరచండి’
చైనాను అధిగమించి..ప్రపంచానికి అన్నపూర్ణగా భారత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions