Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > EGG PUFFల ఖర్చు రూ.3.6 కోట్లు.. స్పందించిన వైసీపీ!

EGG PUFFల ఖర్చు రూ.3.6 కోట్లు.. స్పందించిన వైసీపీ!

egg puffs

EGG Puffs Bill In AP | మాజీ సీఎం జగన్ (YS Jagan) హయాంలో ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కేవలం ఎగ్ పఫ్ ల కోసం రూ.3 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసారని సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది.

యావరేజ్ గా సంవత్సరానికి రూ.72 లక్షలు కేవలం ఎగ్ పఫ్ లపైనే ఖర్చు చేసారని, మొత్తంగా 18 లక్షల ఎగ్ పఫ్ లు తిన్నారని కథనాలు వస్తున్నాయి. ఇదే విషయం పై వైసీపీ అధికారికంగా స్పందించింది. వాస్తవాలను దృవీకరించకుండా, విశ్వసనీయ వర్గాలను ఉటంకించకుండా నిరాధారమైన పుకార్లను సృష్టించకూడదని వైసీపీ స్పష్టం చేసింది.

వార్తను దృవీకరించకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం సరికాదని జగన్ పార్టీ తెలిపింది. వాస్తవానికంటే సంచలనానికి ప్రాధాన్యత అధికంగా ఇస్తున్నారని, కల్పిత కథలపై కాకుండా వాస్తవాలపై దృష్టి సారించాలని వైసీపీ పేర్కొంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions