Saturday 15th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో వేయండి’

‘పోలీస్ అంకుల్.. మా నాన్నను జైల్లో వేయండి’

boy complaints against father

Dhar Police Station | తన తండ్రిని జైల్లో వేయండి అంటూ ఓ చిన్నపిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ పిల్లాడు తండ్రని జైల్లో ఎందుకు వేయాలి అని చెప్పిన కారణం అందర్నీ నవ్వేలా చేసింది.

మధ్యప్రదేశ్ లోని ధార్ పట్టణంకు చెందిన ఓ చిన్నపిల్లాడు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తండ్రి తనను ఆడుకోనివ్వడం లేదని, రోడ్డుపై తిరగనీయడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నది తీరానికి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని తండ్రి ఇక్బాల్ పై ఫిర్యాదు చేశాడు.

తండ్రిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోరాడు. పిల్లాడి ఫిర్యాదు విన్న అక్కడి వారందరు పగలబడి నవ్వుకున్నారు. ఫిర్యాదు చేయడానికి తన తండ్రితో కలిసి ఠాణాకు వెళ్లడం విశేషం.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions