Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డ కేసీఆర్

ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డ కేసీఆర్

kcr-slipped-in-the-farm-house

-హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలింపు
-కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన పట్టుతప్పి కాలుజారి పడ్డారు. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయనకు ఆపరేషన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లు అమర్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని చెపుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions