Sunday 13th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుంది

కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుంది

Congress government will rule for few days

-కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేయటం ఖాయం
-ఏడాది తర్వాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
-బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని అన్నారు. ఒక్క ఏడాది మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందని.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ చేసి వెళ్లిన అప్పులు తీర్చే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడుతుందని.. ఏడాదిలోపే ఆ పార్టీ చేతులెత్తేస్తుందని అన్నారు. ఆపై తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని దళితులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ప్రజలు సీఎంనే మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారు అంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
త్రిష పేరుతో వ్యాఖ్య.. ఉదయనిధిపై TVK, BJP తీవ్ర విమర్శలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions