Sunday 13th September 2026
12:07:03 PM
Home > తెలంగాణ > తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేశారు..

తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేశారు..

telangana election results live updates

నిన్న రేవంత్ ను కలిసిన డీజీపీపై ఈసీ సస్పెన్షన్ వేటు
-ఏపీలో చాలా మంది పోలీసు అధికారులు బరి దాటుతున్నారన్న వర్ల
-అమాయకులను హింసిస్తున్నారని మండిపాటు

హైదరాబాద్ :తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న ప్రారంభమైన కాసేపటికే డీజీపీ అంజనీ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ డీజీపీని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ..అత్యుత్సాహంతో రేవంత్ ను కలిసిన తెలంగాణ డీజీపీని సస్పెండ్ చేశారని చెప్పారు. తమ రాష్ట్రంలో చాలా మంది పోలీసు అధికారులు బరి దాటి… ముఖ్యమంత్రి దగ్గర ‘నీ బాంచెన్ దొరా’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, అమాయకులను హింసిస్తున్నారని మండిపడ్డారు. వీరిపై చర్యలను ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!
తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions