Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > బీఆరెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి షాక్.. కేసు నమోదు!

బీఆరెస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి షాక్.. కేసు నమోదు!

padi kaushik reddy

తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ హుజూరాబాద్‌ (Huzurabad) బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి (Padi Kaushik Reddy) బిగ్ షాక్ తగిలింది.

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఎంపీడీవో ఫిర్యాదుతో  కమలాపూర్‌ (Kamalapur)లోని పోలీసు స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది.

ఎన్ని కల ప్రచారంలో భాగంగా చివరి రోజు కౌశిక్ రెడ్డి ఓ రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘‘మీరు ఓటేసి గెలిపిస్తారా?

లేదంటే కమలాపూర్ బస్టాండ్‌లో మా కుటుంబమంతా ఉరేసుకోమం టరా? మీరు ఓటేసి గెలిపిస్తే నా జైత్రయాత్ర వస్తా.. లేకుంటే 4వ తారీఖు మా శవయాత్రకు రండి” అని వ్యాఖ్యానించారు.

కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ (Election Commssion) సీరియస్ అయ్యింది.

కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై విచారణ జరిపి విచారణ నివేదిక పంపాలని రిటర్నింగ్ అధికారి(RO)ని ఈసీ ఆదేశించింది.

దీంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కమలాపూర్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions