తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ హుజూరాబాద్ (Huzurabad) బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి (Padi Kaushik Reddy) బిగ్ షాక్ తగిలింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్ (Kamalapur)లోని పోలీసు స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది.
ఎన్ని కల ప్రచారంలో భాగంగా చివరి రోజు కౌశిక్ రెడ్డి ఓ రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘‘మీరు ఓటేసి గెలిపిస్తారా?
లేదంటే కమలాపూర్ బస్టాండ్‌లో మా కుటుంబమంతా ఉరేసుకోమం టరా? మీరు ఓటేసి గెలిపిస్తే నా జైత్రయాత్ర వస్తా.. లేకుంటే 4వ తారీఖు మా శవయాత్రకు రండి” అని వ్యాఖ్యానించారు.
కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ (Election Commssion) సీరియస్ అయ్యింది.
కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై విచారణ జరిపి విచారణ నివేదిక పంపాలని రిటర్నింగ్ అధికారి(RO)ని ఈసీ ఆదేశించింది.
దీంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కమలాపూర్ లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయ్యింది.