- ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
- ఆరెంజ్ క్యాప్‌తో పాటు ప్రైజ్ మనీ ఎంతంటే?
Vaibhav Suryavanshi IPL 2026 Total Earnings | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల ప్రశంసలు అందుకున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. కేవలం ఆటతోనే కాదు, సంపాదనలోనూ సరికొత్త రికార్డులు సృష్టించాడు.
ఈ ఐపీఎల్ సీజన్ ద్వారా వైభవ్ ఏకంగా రూ. కోట్లలో ఆర్జించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఐపీఎల్ వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 1.10 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే లీగ్‌లో అద్భుత ప్రదర్శన ద్వారా అతను సాధించిన అవార్డుల రివార్డుల విలువ అంతకు రెట్టింపుగా మారింది. ఈ సీజన్లో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (MVP)గా నిలిచినందుకు వైభవ్‌కు రూ. 15 లక్షలు, అత్యధిక పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ (Orange Cap) సొంతం చేసుకున్నందుకు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
వీటితో పాటు ‘సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్’, ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’, ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’ గా నిలిచినందుకు మరో రూ. 30 లక్షల నగదు బహుమతితో పాటు సరికొత్త “టాటా సి యోరా” (Tata Curvv/Ev) కారును కూడా వైభవ్ గెలుచుకున్నాడు.
టోర్నమెంట్ పొడవునా స్థిరమైన ప్రదర్శన కనబరిచిన వైభవ్, మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా భారీగా వెనకేశాడు. ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఫీజు రూ. 7.5 లక్షలుగా ఉండగా.. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, కేవలం మ్యాచ్ ఫీజుల ద్వారానే రూ. 1.20 కోట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
బేస్ ప్రైస్, అవార్డుల మనీ, మ్యాచ్ ఫీజులు అన్నీ కలిపి ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారానే వైభవ్ సూర్యవంశీ మొత్తం రూ. 2.85 కోట్లకు పైగా ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా క్రేజీ ఓపెనర్‌గా మారిన వైభవ్‌కు పలు బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా అదనపు ఆదాయం లభించింది.
15 ఏళ్ల వయస్సులోనే ఒక అథ్లెట్ ఈ స్థాయి వైభవాన్ని, ఆదాయాన్ని అందుకోవడం క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు.







