Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > గణేశ్ నిమజ్జనాలపై ఆంక్షలు లేవు.. ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!

గణేశ్ నిమజ్జనాలపై ఆంక్షలు లేవు.. ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ!

av rangananth

No Restrictions On Ganesh Immersion గణేశ్ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా పేరుగాంచిన భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, వ్యతిరేక ప్రచారాలపై హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.

చెరువుల్లో గణనాథుల నిమజ్జనానికి హైడ్రా ఎలాంటి వ్యతిరేకం కాదని, తాము పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద నిమజ్జనాలపై ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సున్నితమైన చెరువులపైనే ఆంక్షలు..

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన నాలుగైదు సున్నితమైన చెరువుల వద్ద మాత్రమే నిమజ్జనంపై పరిమితులు ఉన్నాయి. దేశంలోనే తొలి బయో డైవర్సిటీగా గుర్తించిన అమీన్‌పూర్ చెరువు, నేచురల్ వెట్‌ల్యాండ్‌గా ఉన్న కాప్రా చెరువులకు రక్షణ కల్పిస్తున్నారు.

కాప్రా చెరువులో నీరు లేదని పేర్కొంటూ, నగరంలోని మిగిలిన అన్ని జలాశయాలు మరియు చెరువుల్లో నిమజ్జనాలు ఎప్పటిలాగే సాగుతాయని తేల్చి చెప్పారు.

బేబీ పాండ్స్ ఏర్పాటు..

చెరువుల పర్యావరణం దెబ్బతినకుండా మరియు భక్తులకు ఇబ్బంది కలగకుండా విస్తృతంగా ‘బేబీ పాండ్స్’ (Baby Ponds) సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణ హితంగా జరుపుకునేందుకు ప్రజలు మరియు ఉత్సవ సమితీ సభ్యులు సహకరించాలని కోరారు.

You may also like
HYDERABAD: గచ్ఛిబౌలి లో ఘోర ప్రమాదం!
HYDERABAD: సామాన్యుడిలా బైక్‌పై నగర సీపీ సజ్జనర్!
కేబీఆర్ పార్కు వద్ద వన్ వే ట్రాఫిక్.. వాకర్స్‌తో ట్రాఫిక్ పోలీసుల భేటీ!
tg high court
హైడ్రా వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions