Thursday 17th September 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘అందరి చూపు అతడివైపే..14 నెలల తర్వాత భారత జట్టులోకి’

‘అందరి చూపు అతడివైపే..14 నెలల తర్వాత భారత జట్టులోకి’

Mohammed Shami Comeback | టీం ఇండియా ( Team India ) స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి భారత జట్టులోకి వచ్చారు. 2023 వరల్డ్ కప్ అనంతరం గాయం కారణంగా టీంకు దూరమైన షమీ 14 నెలల తర్వాత మళ్ళీ టీంలోకి వచ్చారు.

ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ( BCCI ) భారత జట్టును ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో షమీకి కూడా చోటు దక్కింది. ఈ క్రమంలో టీంతో కలిసి షమీ ప్రాక్టీస్ సెషన్ ( Practice Session ) లో పాల్గొన్నారు.

కోల్కత్త ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens ) వేదికగా ఇంగ్లాండ్ తో టీం ఇండియా తొలి టీ20 ఆడనుంది. ఓ వైపు బుమ్రా గాయం బారిన పడడంతో ఇప్పుడు అందరి చూపు షమీ వైపే. టీంతో కలిసి ప్రాక్టీస్ సెషన్ కు వచ్చిన షమీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ను కలిశారు.

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రాక్టీస్ లో పాల్గొన్న షమీ ఏకదాటిగా 45 నిమిషాలు బౌలింగ్ చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions