Thursday 17th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దావోస్ కు వెళ్తూ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న తెలుగురాష్ట్రాల సీఎంలు

దావోస్ కు వెళ్తూ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్న తెలుగురాష్ట్రాల సీఎంలు

CM Revanth Reddy and AP CM Chandrababu Meets At Zurich Airport | దావోస్‌ ( Davos )లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బయలుదేరిన విషయం తెల్సిందే.

ఈ క్రమంలో స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ ( Zurich ) విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) కలుసుకున్నారు. అక్కడ కాసేపు భేటీ అయ్యి ముచ్చటించుకున్నారు.

ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా సోమవారం జ్యురిచ్ లో పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.

కాగా దావోస్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుండి ఐదుగురు కేంద్రమంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రులు, 100కు పైగా వివిధ కంపెనీల సీఈఓ ( CEO )లు వెళ్లనున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions