UP woman kills husband with help of lover, contract killer | ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ భార్య తన ప్రియుడితో కలసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ ఘటన మరవకముందే మరో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది.
యూపీ లోని మెయిన్ పురి కి చెందిన ప్రగతి యాదవ్ పెళ్ళైన రెండు వారాలకే భర్తను క్రూరంగా హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్తే..ప్రగతి యాదవ్ అదే గ్రామానికి చెందిన అనురాగ్ యాదవ్ గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కుటుంబం ప్రగతి యాదవ్ కు బలవంతంగా 22 ఏళ్ల దిలీప్ యాదవ్ తో మార్చి 5 2025న వివాహం జరిపించారు.
కానీ పెళ్లి ఇష్టం లేని ప్రగతి, తన ప్రియుడితో ఉండాలని భావించింది. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేసేందుకు ప్రియుడు అనురాగ్ యాదవ్ తో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా రూ.2 లక్షలకు హత్య చేయడానికి ఓ కిరాయి హాంతకుడు ఒప్పుకున్నాడు.
ప్రియురాలు ఇచ్చిన రూ.లక్షను రామ్జీ నగర్ అనే కిరాయి హాంతకుడికి ప్రియుడు అనురాగ్ యాదవ్ అడ్వాన్స్ ఇచ్చాడు. కన్నౌజ్ నుండి తిరిగివస్తున్న సమయంలో దిలీప్ యాదవ్ కు మాయ మాటలు చెప్పిన హంతకుడు, పంట పొలాల్లోకి తీసుకెళ్లి దారుణంగా కొట్టి చంపారు.
ఆ తర్వాత దిలీప్ యాదవ్ శరీరాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీసీ ఫుటేజ్ ఆధారంగా కిరాయి హాంతకుడ్ని పట్టుకున్నారు. కూపీ లాగగా భార్య, ప్రియుడితో కలిసి వేసిన ప్లాన్ బయటకు వచ్చింది. పెళ్ళైన కేవలం రెండు వారాల లోపే దిలీప్ యాదవ్ ను భార్య హత్య చేయించడం సంచలనంగా మారింది.