Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సిగరెట్ కోసం ఏకంగా రైలునే ఆపేసిన లోకో పైలట్!

సిగరెట్ కోసం ఏకంగా రైలునే ఆపేసిన లోకో పైలట్!

loco pilot

Loco Pilot Stops Train For cigarettes | ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో భారతీయ రైల్వే లోకో పైలట్  నిర్లక్ష్యానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సిగరెట్ తాగాలనే తహతహతో లోకో పైలట్ ఏకంగా రైలును 10 నిమిషాలపాటు నిలిపివేశాడు.

వివరాల ప్రకారం, డిసెంబర్ 17న NTPC ప్రాజెక్ట్ నుంచి బొగ్గుతో ఉన్న గూడ్స్ రైలు తిరిగి వెళ్తుండగా, లోకో పైలట్ ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలును నిలిపివేసి సిగరెట్ తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటన ఊంచహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాన్ రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం, రైలు సుమారు 10 నిమిషాల పాటు క్రాసింగ్ వద్ద నిలిచిపోయి, రోడ్డు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ సంఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా, రైల్వే అధికారులు స్పందించారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించాలని ఆదేశిస్తూ, స్టేషన్ సూపరింటెండెంట్‌కు విచారణ బాధ్యతలను అప్పగించారు. దర్యాప్తు అనంతరం సంబంధిత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions