Wednesday 12th August 2026
12:07:03 PM
Home > తాజా > ఇలాంటి ఫిబ్రవరి మళ్లీ 823 ఏళ్ల తర్వాత?

ఇలాంటి ఫిబ్రవరి మళ్లీ 823 ఏళ్ల తర్వాత?

Viral News | 2026 సంవత్సరంలోని ఫిబ్రవరి నెల మళ్లీ 823 ఏళ్ల తర్వాతే వస్తుంది అనే ప్రచారం వైరల్ గా మారింది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా నాలుగు సార్లు వస్తుంది, ఇలాంటిది జీవితకాలంలో మళ్లీ రాదు అని పోస్టులు, వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని పోస్టుల్లో “25 గంటల రోజు” కూడా ఉంటుందని, ఇది అద్భుత సంఘటన అని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఈ ప్రచారం పూర్తిగా కల్పితం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం, లీప్ ఇయర్ కాని సంవత్సరంలో ఫిబ్రవరి ఎల్లప్పుడూ 28 రోజులే ఉంటుంది. 28 రోజులు అంటే ఖచ్చితంగా 4 వారాలు.

అందువల్ల ప్రతి వారం ఆదివారం నుంచి శనివారం వరకు ఖచ్చితంగా నాలుగు సార్లు వస్తుంది. ఇది నాన్ లీప్ ఇయర్ ప్రతి ఫిబ్రవరిలోనూ జరుగుతుంది. 2026 లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. ఈ నెల మాత్రం ఆదివారం మొదలై శనివారం ముగుస్తుంది. కాబట్టి క్యాలెండర్ చూడటానికి చక్కగా, సమానంగా కనిపిస్తుంది. ఇది “అద్భుతం” కాదు కేవలం సాధారణం మాత్రమే. ఇలాంటి ఫిబ్రవరి గతంలో 2015లో వచ్చింది, భవిష్యత్తులో 2037లో మళ్లీ వస్తుంది. సుమారు 11 లేదా 22 సంవత్సరాల చక్రంలో ఇలాంటివి వస్తూ ఉంటాయి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions