Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > కొత్త వాహనం కొంటున్నారా.. అయితే మీకో శుభవార్త!

కొత్త వాహనం కొంటున్నారా.. అయితే మీకో శుభవార్త!

new vehicle registration in showroom

Vehicle Registration At Showroom | మీరు కొత్త వాహనం కొంటున్నారా? అయితే మీకో శుభవార్త. వెహికిల్ రిజిస్ట్రేషన్ (Vehicle Registration) కోసం మీరు ఇక ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఆర్టీఏ ఏజెంట్లు, బ్రోకర్లకు డబ్బులు సమర్పించనక్కర్లేదు.

ఎందుకంటే వాహన రిజిస్ట్రషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు వీలు కల్పించనుంది.

సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం అమలు కోసం అవసరమైన సాఫ్ట్‌ వేర్‌ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

దీని ప్రకారం, వాహన డీలర్లే కస్టమర్ నుంచి అవసరమైన అన్ని పత్రాలను తీసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. రవాణా శాఖ అధికారి ఆ పత్రాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలించి, డిజిటల్‌గా ఆమోదం తెలుపుతారు.

ఆ తర్వాత వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్‌సీ) కార్డును నేరుగా యజమాని చిరునామాకు పోస్టులో పంపిస్తారు.

అయితే వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కొత్త కార్లు, మోటార్‌సైకిళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.  కమర్షియల్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు యథావిధిగా ఆర్టీఏ కార్యాలయాల్లోనే కొనసాగుతాయి.  

You may also like
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!
vc sajjanar
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!
gurram guda forest land
గుర్రం గూడ అటవీ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటింపు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions