Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > కార్తీక మాసంలో శైవ క్షేత్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు

కార్తీక మాసంలో శైవ క్షేత్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు

tgsrtc

TGSRTC Special Buses For Karthika Masam | ప‌విత్ర కార్తీక మాసంలో ప్ర‌సిద్ధ శైవ క్షేత్రాల‌కు భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు టీజీఎస్ఆర్టీసీ ( TGSRTC ) ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ ( Sajjanar ) తెలిపారు.

శ్రీశైలం ( Srisailam ), వేముల‌వాడ, ధ‌ర్మ‌పురి ( Dharmapuri ), కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి స్పెష‌ల్ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్య ప‌థ‌కం, త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి శ‌నివారం వ‌ర్చ్‌వ‌ల్‌గా ఉన్న‌త‌స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఆర్టీసీకి కార్తీక మాసం, శ‌బ‌రిమ‌ల ఆప‌రేష‌న్స్ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆయ‌న దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమ‌వారాలు శైవ‌క్షేత్రాల‌కు భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు.

ఈ నెల 15న కార్తీక పౌర్ణ‌మి నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని అరుణాచ‌లాని ( Arunachalam )కి ప్ర‌త్యేక ప్యాకేజీని అందిస్తున్నామ‌ని తెలిపారు. అలాగే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని పంచారామాల‌కు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వివ‌రించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions