Wednesday 13th May 2026
12:07:03 PM
Home > తాజా > వాహనదారులకు భారీ ఊరట.. ఆ పన్ను నుంచి మినహాయింపు?

వాహనదారులకు భారీ ఊరట.. ఆ పన్ను నుంచి మినహాయింపు?

ts govt logo

No LIfe Tax For 2nd Vehicle | వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govenrment) భారీ ఊరట కలిగించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిస్తోంది.

ఈ మేరకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వాహనం కొనేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లిస్తున్నారు.

ఉదాహరణకు రూ.1.20 లక్షల విలువైన బైక్‌ను రెండో వాహనంగా కొంటే రూ.2,400 అదనంగా చెల్లించాలి. వాహన ఉద్గారాల ద్వారా వెలువడే కాలుష్య నియంత్రించడానికి రెండో వాహనం కొనుగోళ్లను తగ్గించాలని గతంలో ఈ పన్నును ప్రవేశపెట్టారు.

అయితే, చాలామంది ఈ పన్నును త‌ప్పించుకోవడానికి తమ కుటుంబసభ్యుల పేర్ల మీద వాహనాలు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల బీమా క్లెయిమ్‌ల సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘వాహన్’లో చేరాలని నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో ఒక వ్యక్తికి ఇదివరకే వాహనం ఉందో లేదో గుర్తించేందుకు ప్రత్యేక ఆప్షన్ లేదు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌ వేర్ రూపొందించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ అదనపు పన్నును రద్దు చేయడమే సరైన మార్గమని రవాణా శాఖ ప్రభుత్వానికి సూచించింది.  

You may also like
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions