Thursday 8th October 2026
12:07:03 PM
Home > తాజా > టైగర్.. చీతా.. రెడ్ హార్స్.. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు!

టైగర్.. చీతా.. రెడ్ హార్స్.. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు!

  • సరఫరాకు 18 కంపెనీల దరఖాస్తులు..
  • సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ!

New Liquor Brands in TG తెలంగాణ మద్యం మార్కెట్లో కొత్త మద్యం బ్రాండ్‌లను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్రంలో కొత్త బ్రాండ్లను సరఫరా చేయడానికి వివిధ కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎక్సైజ్ శాఖ అధికారికంగా కోరింది.

121 కొత్త బ్రాండ్లు – 18 కంపెనీలు..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ మరియు హర్యానా వంటి ఏడు రాష్ట్రాలకు చెందిన 18 ప్రముఖ మద్యం కంపెనీలు 121 కొత్త బ్రాండ్‌లను సరఫరా చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.

ప్రతిపాదించిన బ్రాండ్లు..

బీర్, విస్కీ, వైన్, వోడ్కా, బ్రాందీ, జిన్ మరియు టేకిలా వర్గాలకు చెందిన బ్రాండ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అబెస్ట్, చీతా, ఫ్లెన్స్‌బర్గ్, టైగర్, శాన్ మిగెల్, రెడ్ హార్స్, భూటానీస్, సియోక్‌బింగో, కాకావోస్ మరియు డోంగాంగ్ వంటి పలు కొత్త బీర్ బ్రాండ్‌లు దరఖాస్తు చేసుకున్న వాటిలో ఉన్నాయి.

వెబ్‌సైట్‌లో వివరాలు: దరఖాస్తు చేసుకున్న 18 కంపెనీల వివరాలను, వారు సమర్పించిన పత్రాలను ఎక్సైజ్ శాఖ తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ..

కొత్త బ్రాండ్ల సరఫరా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ముందు ప్రజా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపారు.ప్రతిపాదిత బ్రాండ్‌ల సరఫరాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు వాటిని సెప్టెంబర్ 1 వ తేదీ లోగా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)కు వ్యక్తిగతంగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ సమర్పించవచ్చు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, శాఖ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

You may also like
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు!
రూ. 8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కిచెన్!
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions