Saturday 2nd December 2023
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > వరల్డ్ కప్ లో ఇండియా ఓటమిని తట్టుకోలేక గుండె పోటుతో మృతి!

వరల్డ్ కప్ లో ఇండియా ఓటమిని తట్టుకోలేక గుండె పోటుతో మృతి!

death

ICC World Cup | క్రికెట్ ను కూడా ఒక మతం లాగా భావించే భారతీయులు, వరల్డ్ కప్ ఫైనల్స్ (India Vs Austrilia)లో ఇండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాచ్ ఓడిపోవడంతో అనేక మంది క్రికెట్ (Cricket) అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.

కాగా, తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ (Jyothi Kumar Yadav) టీం ఇండియా (India) ఓటమిని భరించలేక గుండెపోటుతో మరణించారు.

బిటెక్ పూర్తి చేసిన జ్యోతి కుమార్ కంప్యూటర్ సెంటర్ ను నడుపుతున్నారు. ఆదివారం రాత్రి తన స్నేహితులతో కలిసి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసారు.

కానీ మ్యాచ్ ఓడిపోవడం తో తీవ్ర మనోవేదనకు, ఆందోళనకు గురయ్యాడు. ఓటమి తర్వాత భారత ప్లేయర్స్ కన్నీరుపెట్టుకోవడాన్ని చూస్తూ ఒక్కసారిగా కుప్పకులాడు జ్యోతి కుమార్.

స్నేహితులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు వైద్యులు.

You may also like
icc trophy
ICC వరల్డ్ కప్ కు తీవ్ర అవమానం..!
ప్రతిపక్షాల కూటమి పేరు ‘INDIA’.. అంటే అర్థం తెలుసా!

Leave a Reply

Designed & Developed By KBK Business Solutions