Saturday 2nd December 2023
12:07:03 PM
Home > క్రీడలు > Cricket లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి.. నటుడి సంచలన వ్యాఖ్యలు..!

Cricket లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి.. నటుడి సంచలన వ్యాఖ్యలు..!

bcci

Reservations in Cricket వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓటమి పై సంచలన ట్వీట్ చేశారు కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస (Chetan Kumar Ahimsa). క్రికెట్ లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

” నేను మళ్ళీ చెపుతున్న, భారత క్రికెట్ టీం (Team India) లో కూడా రిజర్వేషన్లు (Reservations In Cricket) ఉండాలి.

భారత్ క్రికెట్ టీం లో రిజెర్వేషన్లు ఉండి ఉంటే, సునాయాసంగా ఈ మ్యాచ్ ను గెలిచేవారు” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు చేతన్ కుమార్.

చేతన్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా టీం ఇండియా లో రిజెర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు.

టీం ఇండియా లో 70 శాతం అగ్రవర్ణాలకు చెందిన ప్లేయర్సే ఉన్నారని, ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లు క్రికెట్ లో కూడా అమలు చేస్తే మెరుగైన ప్రదర్శనకు దారి తీస్తుందని గతంలోనే వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా తమ జాతీయ జట్టులో నిర్దిష్ట సంఖ్యలో శ్వేతజాతియేతర ఆటగాళ్లు ఉండే విదంగా సౌత్ ఆఫ్రికా (South Africa) దేశం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు చేతన్ కుమార్.

కాగా ఆయన చేసిన ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Designed & Developed By KBK Business Solutions