Gautham Gambhir | టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రెండేండ్ల పాటు LSG (Lucknow Super Giants) మెంటర్ గా బాధ్యతలు నిర్వహించిన గంభీర్ ఆ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించారు.
ఇన్నిరోజులు తనకు మద్దతుగా నిలిచిన LSG టీం కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తాను తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్టులో భాగం కాబోతున్నట్లు ప్రకటించారు.
ఆ టీం కు మెంటర్ (Mentor) గా బాధ్యతలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు KKR సీఈఓ వెంకీ మైసూర్. తిరిగి కోల్కతా టీం కు రావడం పై భావోద్వేగానికి గురయ్యారు గంభీర్.
తాను KKR టీం కు రావడం కాదని, సిటీ ఆఫ్ జాయ్(City Of Joy) కు వస్తున్నట్లు అభివర్ణించారాయన.
గంభీర్ తిరిగి టీం లోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు KKR సహా యజమాని షా రూఖ్ ఖాన్ (Shah Rukh Khan). కెప్టెన్ తిరిగి రావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు షా రూఖ్.