Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమిత్ షా ఎఫెక్ట్.. తమిళిసై ఇంటికి అన్నామలై!

అమిత్ షా ఎఫెక్ట్.. తమిళిసై ఇంటికి అన్నామలై!

ANNAMALAI MEETS SOUNDARA RAJAN

Annamalai Meets Tamilisai | ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah), తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై (Tamilisai) మధ్య జరిగిన సంభాషణ వీడియో వైరల్ గా మారిన విషయం తెల్సిందే.

ఈ పరిణామం అనంతరం తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై  శుక్రవారం తమిళిసై ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై కృషిని కొనియాడారు. భవిష్యత్ లో ఆమె రాజకీయ అనుభవం, సలహాలు పార్టీకి ఎంతగానో దోహదపడుతాయన్నారు.

ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల అనంతరం తమిళిసై, అన్నామలై ల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళిసై తో అమిత్ షా ఈ విషయం పై గంభీరంగా మాట్లాడినట్లు వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టాలనే తాజగా అన్నామలై, తమిళిసై కలిసినట్లు తెలుస్తోంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
pawan annamalai
పవనన్నా మీ నిర్ణయం ప్రశంసనీయంఅన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions