Monday 9th December 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!

ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన ఎక్స్ ప్రెస్!

train accident

Train Accident | దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ ప్రెస్.. ముందు వెళ్తున్న గూడ్స్‌ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో న్యూ జల్‌పాయ్‌గురి రైల్వే స్టేషన్ నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్ మధ్య సిలిగురి వద్ద సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాద తీవ్రతో ఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కి గాల్లోకి లేచాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. పలువురు ప్రయాణికులు మృతి చెందగా.. చాలా మంది గాయపడ్డారు.

ఘటన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి.. ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు.

You may also like
Greece train accident
ఘోర రైలు ప్రమాదం.. 32 మంది సజీవ దహనం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions