Saturday 19th September 2026
12:07:03 PM
Home > తాజా > Globetrotter ఈవెంట్..వారు రావొద్దు

Globetrotter ఈవెంట్..వారు రావొద్దు

#SSMB29 Event Instructions Explained By SS Rajamouli | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ #ఎస్ఎస్ఎంబీ29 మూవీకి సంబంధించి నవంబర్ 15న భారీ ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులకు పలు సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తూ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఈవెంట్ పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని కోరారు. అలాగే ఇటీవల జరిగిన కొన్ని సంఘటన నేపథ్యంలో 18 ఏళ్ల లోపు వయసున్న వారికి అలాగే వృద్ధులకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఈ క్రమంలో వారు రావొద్దని చెప్పారు. పోలీసుల సూచనలు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అలాగే అభిమానుల సేఫ్టీ కోసమే అని పేర్కొన్నారు.

ఈవెంట్ జరిగే రోజు విజయవాడ-హైదరాబాద్ హైవే పై ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ అవుతుందని, ఈవెంట్ కు వచ్చేవారు లోపలికి ఎలా రావాలి అనేది పాసులపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే అందులో ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ 15 మధ్యాహ్నం రెండు తర్వాత ఈవెంట్ కు హాజరయ్యే వారు రావొచ్చని తెలిపారు. ఈ ఈవెంట్ కు అందరినీ అనుమతిస్తారు అని సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. అందరూ ఈవెంట్ విజయవంతంగా జరిగేలా సహకరించాలని రాజమౌళి విజ్ఞప్తి చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions