Sunday 3rd May 2026
12:07:03 PM
Home > తాజా > మొన్న పాస్ పోర్ట్.. నేడు మొబైల్..రాజమౌళి చేతిలో మహేశ్ బంధీ!

మొన్న పాస్ పోర్ట్.. నేడు మొబైల్..రాజమౌళి చేతిలో మహేశ్ బంధీ!

ssmb 29

SSMB 29 Movie Updates | టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ( Mahesh Babu ), దర్శక ధీరుడు రాజ‌మౌళి ( SS Rajamouli )కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ గ‌చ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల స‌మాచారం. అయితే ఈ సినిమా పట్ల దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా లీక‌వ్వ‌కుండా కేర్ తీసుకుంటున్నారట.

అందులో భాగంగానే షూటింగ్ సెట్స్ ( Shooting Sets ) లోకి ఎవ‌రి ఫోన్ కూడా అనుమ‌తించ‌డం లేదని టాక్. చివరికి హీరో మ‌హేష్ బాబు కు కూడా మిన‌హాయింపు ఇవ్వలేదట. ఇటీవల సింహంని జైల్లో బంధించి దాని పాస్‌పోర్టుని తీసుకున్నట్టు ఓ మోషన్ పోస్టర్ ని రాజ‌మౌళి త‌న ఇన్‌స్టాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే.

కెఎల్ నారాయ‌ణ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ గా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) కీల‌క పాత్ర‌ లో న‌టించ‌నున్న ఎస్ఎస్ఎంబీ29కు ఆస్కార్ విజేత ఎం.ఎం కీర‌వాణి ( MM Keeravani ) సంగీతం అందిస్తున్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions