Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > శివ రీరిలీజ్..మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్

శివ రీరిలీజ్..మంత్రి కోమటిరెడ్డి పోస్ట్ వైరల్

‘SHIVA’ Re Release | అక్కినేని నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబోలో 1989లో రిలీజ్ అయిన ‘శివ’ మూవీ తెలుగు సినీ పరిశ్రమ దశాదిశను మార్చేసింది. ఈ సినిమా ప్రభావం ఎంతోమందిపై చెరగని ముద్ర వేసింది. మళ్లీ 36 ఏళ్ల తర్వాత నవంబర్ 14న శివ రీరిలీజ్ అయ్యింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. శివ రీరిలీజ్ సందర్భంగా నాగార్జున, ఆర్జీవి మరియు మూవీ టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాగార్జున సినీ కెరీర్ ను కొనియాడారు.

‘ప్రియమైన నాగార్జున గారు ‘శివ’ తెలుగు సినిమాను పునర్నిర్వచించింది. మీ స్క్రీన్ ప్రసెన్స్, నటన అద్భుతం. దివంగత అక్కినేని నాగేశ్వర రావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అర్ధవంతమైన సినిమాలతో ముందుకు వెళ్తున్న మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. శివ నుండి అన్నమయ్య, షిర్దీ సాయి మరియు నాకు ఎంతో ఇష్టమైన భక్త రామదాసు వంటి సినిమాల్లో మీ నటన, మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తాయి. శివ మరోసారి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions