Wednesday 16th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తీరప్రాంత ప్రజలకు రజినీకాంత్ కీలక సూచన

తీరప్రాంత ప్రజలకు రజినీకాంత్ కీలక సూచన

Rajinikanth urges coastal villagers to support CISF Cyclothon against terrorism | సూపర్ స్టార్ రజినీకాంత్ తీరప్రాంత ప్రజలకు కీలక సూచన చేశారు. సముద్ర తీరప్రాంత ప్రజలు కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తీరప్రాంతాల గుండా దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు CISF జవాన్లకు మద్దతుగా ఒక వీడియోను విడుదల చేశారు. మన దేశ ప్రతిష్టను, శాంతిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా దేశంలో ప్రవేశించి విధ్వంసకర ఘటనలకు పాల్పడుతున్నారని సూపర్ స్టార్ రజినీ కాంత్ వివరించారు.

ఇందుకు ఉదారహణ 2011లో ముంబైలో జరిగిన బాంబు దాడులేనని చెప్పారు. ఇందులో మొత్తంగా 175 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

ఎవరైన కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానాస్పద స్థితిలో ఏమైనా చేసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు వందమంది CISF జవాన్లు పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు 7 వేల కీ.మీ. సైకిల్ యాత్ర ప్రారంభించారని చెప్పిన రజినీకాంత్ వారికి సహకరించాలని కోరారు

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions