Tuesday 17th June 2025
12:07:03 PM
Home > తాజా > ‘#సింగిల్’ సినిమా కలెక్షన్లలో కొంత భారత సైన్యానికి

‘#సింగిల్’ సినిమా కలెక్షన్లలో కొంత భారత సైన్యానికి

Allu Aravind Donates Film Profits to Indian Army | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైన్యానికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీవిష్ణు, కేతిక శర్మ జంటగా కార్తిక్ రాజు తెరకెక్కించిన సినిమా సింగిల్. శుక్రవారం ఈ సినిమా విడుదల అయ్యింది.

ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింగిల్ మూవీ కలెక్షన్లలో కొంత భాగాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. తాజగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన విషయం తెల్సిందే.

పాక్ దాడులను ఎదురుకుంటూ భారత పౌరుల రక్షణ కోసం భారత సైన్యం వీరోచితంగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో భారత భద్రతా దళాలకు తమ మద్దతు ఉంటుందని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.

సైనికులు దేశం కోసం పోరాడుతుంటే మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదని, కేవలం ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలపడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
plane crash
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. మేడే కాల్ ఇచ్చిన పైలట్లు!
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
ministers
తెలంగాణలో కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు వీరే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions