Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > నేను చిరంజీవిగా మారి 47 ఏళ్లు: మెగాస్టార్ ట్వీట్!

నేను చిరంజీవిగా మారి 47 ఏళ్లు: మెగాస్టార్ ట్వీట్!

Chiranjeevi

Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానానికి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు సినిమాతో చిరంజీవి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ నేపత్యంలో తన 47 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

22 సెప్టెంబర్ 1978 ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.

నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… కృతజ్ఞతలతో మీ చిరంజీవి అని రాసుకొచ్చారు మెగాస్టార్. ఈ ట్వీట్ ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions