Friday 4th October 2024
12:07:03 PM
Home > తాజా > జానీ మాస్టర్ కేసు..’పుష్ప’ సినిమా నిర్మాత హాట్ కామెంట్స్

జానీ మాస్టర్ కేసు..’పుష్ప’ సినిమా నిర్మాత హాట్ కామెంట్స్

Pushpa Movie Producer On Jani Master | జానీ మాస్టర్ ( Jani Master ) తనను లైంగికంగా వేదించారని ఆరోపిస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ( Choreographer ) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఈ వివాదంలో ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Ican Star Allu Arjun ), దర్శకుడు సుకుమార్ ( Sukumar ) పేర్లు వినిపించాయి. తాజగా ఈ అంశంపై పుష్ప మూవీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ( Ravi Shankar ) స్పందించారు.

కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ( Youtube Channels ) లో సెన్సేషన్ కోసం మాత్రమే అల్లు అర్జున్, సుకుమార్ పేర్లను తీసుకువస్తున్నారని ఆయన చెప్పారు. జానీ మాస్టర్ కు ఆయన అసిస్టెంట్ కు మధ్య జరిగింది అది వారి వ్యక్తిగతం మాత్రమేనని పేర్కొన్నారు.

జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన మహిళ పుష్ప 2 సినిమాలోని పాటలకు అడిషనల్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా రెండు పాటలు మిగిలి ఉన్నట్లు, అక్టోబర్ 15 తర్వాత పాటల షూటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. పుష్ప 2 లో ఓ స్పెషల్ సాంగ్ ( Special Song ) కోసం జానీ మాస్టర్ ను తీసుకోవాలని అనుకున్నట్లు, కానీ ఇంతలోనే ఈ ఘటన జరిగిందని రవిశంకర్ చెప్పారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions