Thursday 7th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఒక్క పైసా వద్దు..రాజ్యాంగాన్ని ఒంటిచేత్తో రాసింది ఎవరో తెలుసా !

ఒక్క పైసా వద్దు..రాజ్యాంగాన్ని ఒంటిచేత్తో రాసింది ఎవరో తెలుసా !

Prem Behari Who Hand-Wrote The Constitution Of India | దేశవ్యాప్తంగా మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ( Constitution Day ) పురస్కరించుకుంటున్నాం.

భారత ప్రజలైన మేము అంటూ మొదలయ్యే రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని హక్కుగా కల్పించింది. రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. అయితే 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది.

ఇదిలా ఉండగా ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఆలోచన నాటి ప్రధాని జవహరలాల్ నెహ్రు ( Jawaharlal Nehru )కు వచ్చింది. చేతిరాతతో రాజ్యాంగాన్ని లిఖిస్తే బాగుంటుందని భావించారు. ఈ మేరకు ఇటాలిక్ చేతిరాతతో నిపుణులు తమను సంప్రదించాలని రేడియోలో ప్రకటన ఇచ్చారు.

దింతో కాలిగ్రఫీ ( Caligraphy )లో ఎంతో అనుభవం ఉన్న ప్రేమ్ బెహరి నారాయణ్ రాయ్ జాదా ( Prem Behari Narain Raizada )ముందుకువచ్చారు. రాజ్యాంగం మొత్తం రాయడానికి ఎంత డబ్బు తీసుకుంటారని నెహ్రు అడగ్గా, ఒక్క పైసా వద్దన్నారు. కానీ, రాజ్యాంగం లోని ప్రతీ పేజీలో తన పేరును, చివరన తన తాత రాం ప్రసాద్ సక్సేనా పేరును రాస్తానని ప్రేమ్ బెహారి చెప్పారు.

దీనికి అంగీకరించిన నెహ్రు ఆమోదం తెలిపారు. వెయ్యేళ్లు మన్నికగా ఉండే పార్చ్ మెంట్ షీట్లపై రాజ్యాంగాన్ని ఆరు నెలల సమయం పాటు రాశారు. ప్రేమ్ బెహారి రాసిన రాజ్యాంగ ప్రతులను ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ ( Parliament Library )లో చూడవచ్చు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions