Thursday 17th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మీ పాదాలకే నా నమస్కారం..ఎమ్మెల్యే అభ్యర్థి పాదాలకు ప్రధాని నమస్కారం

మీ పాదాలకే నా నమస్కారం..ఎమ్మెల్యే అభ్యర్థి పాదాలకు ప్రధాని నమస్కారం

Pm Modi Touched BJP Leader Feet | ఎమ్మెల్యే అభ్యర్థి పాదాలకు ప్రధాని నరేంద్ర మోదీ నమస్కరించడం ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది.

ఆప్ ( AAP ), బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రచార సభల్లో పాల్గొని హామీల వర్షం కురిపిస్తూ, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. అయితే బుధవారం బీజేపీ నిర్వహించిన సభలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.

ఈ సభకు ప్రధాని మోదీ ( Pm Modi ) హాజరయ్యారు. ఈ క్రమంలో ఇతర నాయకులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి ( Ravinder Singh Negi ) ప్రధాని వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేయబోయారు. దింతో ప్రధాని మోదీ రవీందర్ సింగ్ ను అడ్డుకున్నారు.

అనంతరం ప్రధాని ఎమ్మెల్యే అభ్యర్థి పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రవీందర్ సింగ్ నేగి ఢిల్లీలోని పట్పరగంజ్ ( Patparganj ) అసెంబ్లీ నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో ఆప్ తరఫున అవద్ ఓఝా, కాంగ్రెస్ నుండి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions