Sunday 27th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్’

‘ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్’

NZ PM Christopher Luxon plays gully cricket with Kapil Dev | న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ ( Christopher Luxon )రాజధాని ఢిల్లీ వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

న్యూజిలాండ్ ప్రధాని ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. ప్రధానితో పాటు భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ( Ross Taylor ) క్రికెట్ ఆడారు.

కేవలం బ్యాటింగ్ చేయడమే కాకుండా బౌలింగ్ తోనూ ప్రధాని లక్సాన్ అలరించారు. ప్రధాని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టేలర్ కీపింగ్ చేశారు. అనంతరం ప్రధాని కీపింగ్ చేస్తూ బంతిని అద్భుతంగా కాచ్ పట్టుకున్నారు.

గల్లీ క్రికెట్ కు సంబంధించిన ఫోటోలను ఎక్స్ ( X ) వేదికగా షేర్ చేస్తూ న్యూజీలాండ్ పీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేయడంలో క్రికెట్ ను మించింది మరొకటి లేదు అని పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions