Monday 27th July 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పార్లమెంట్‌లో హైడ్రామా.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎన్డీఏ ఘన స్వాగతం!

పార్లమెంట్‌లో హైడ్రామా.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎన్డీఏ ఘన స్వాగతం!

  • అమిత్ షా క్షమాపణకు ప్రతిపక్షాల డిమాండ్!

NDA Welcomes Dharmendra Pradhan | నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మరియు జంతర్ మంతర్ వద్ద చోటుచేసుకున్న సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోమవారం ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎన్డీఏ ఎంపీలు పార్లమెంట్‌లో ఘన స్వాగతం పలికారు.

శనివారం (జూలై 25) ఆయన రాజీనామా ప్రకటించిన తర్వాత, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వచ్చిన ఆయనకు బీజేపీ, ఎన్డీఏ నాయకులు మకర్ ద్వార్ వద్ద నిలబడి సంఘీభావం తెలిపారు.

ప్రధాన్ పార్లమెంట్ ప్రాంగణంలోకి రాగానే పార్టీ సహచరులు ఆయనకు ఘనంగా అభివాదం చేసి, లాంఛనప్రాయంగా టోపీ బహూకరించి లోపలికి తోడ్కొని వెళ్లారు.

‘శిక్షా చోరీ’ అంటూ ప్రియాంక గాంధీ నిరసన

మరోవైపు, పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్షాలు హోరెత్తించాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ప్రతిపక్ష నాయకులు నిరసనకు దిగారు.

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల మితిమీరిన బలప్రయోగానికి, దాడులకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

“శిక్షా చోరీ” (విద్య దొంగతనం) అంటూ ప్లకార్డులు చేతబూని ప్రతిపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు.

 నీట్ వివాదం, పేపర్ లీకేజీలను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

You may also like
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన కేంద్రం!
నీట్ నిరసనల్లో ఉత్తరాఖండ్ కానిస్టేబుల్.. అసలు నిజం ఇదీ!
వారికి ఆజ్ఞలు కాదు.. ప్రేమతో చెప్పాలి: మోహన్ భగవత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions