Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > ‘టాలీవుడ్ ఇండియాలోనే బెస్ట్’

‘టాలీవుడ్ ఇండియాలోనే బెస్ట్’

Mohan Lal About Tollywood | తెలుగు సినీ పరిశ్రమపై మలయాళ అగ్ర నటుడు మోహన్ లాల్ ప్రశంసల వర్షం కురిపించారు. టాలీవుడ్ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ ( Best Film Industry ) అని స్పష్టం చేశారు. గతంలో విడుదలైన ‘లూసిఫర్’ కు సీక్వెల్ గా మోహన్ లాల్ కథానాయకుడిగా, ప్రిథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘ఎల్2:ఎంపురాన్’ ( L2: Empuraan ) త్వరలో మార్చి 27న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత దిల్ రాజు ( Dil Raj ) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ..ఎంతోమంది తెలుగు నటీనటులతో కలిసి పనిచేసినట్లు, అక్కినేని నాగేశ్వర రావు తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం మాట్లాడిన దిల్ రాజు.. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు సినిమాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని, ఇప్పుడు ఆ వరుసలో ప్రిథ్వీరాజ్ సుకుమారన్ చేరారని పేర్కొన్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions