Saturday 27th July 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > Modi Cabinet 3.O: మంత్రులకు కేటాయించిన శాఖలివే!

Modi Cabinet 3.O: మంత్రులకు కేటాయించిన శాఖలివే!

Modi Cabinet 3.O

Modi Cabinet 3.O | ప్రధానిగా నరేంద్ర మోదీతోపాటు మరో 71 మంది మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో 30 మందికి కేబినెట్‌ హోదా ఐదుగురికి స్వతంత్ర హోదా, మిగిలిన 36 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. తాజాగా, సోమవారం సాయంత్రం కేబినెట్ తొలి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో దేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రులకు మోదీ వివిధ శాఖలను కేటాయించారు.

మంత్రులు – శాఖలు:

  1. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ; డిపార్ట్‌ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ; అంతరిక్ష శాఖ
  2. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ మంత్రిత్వ శాఖ
  3. అమిత్ షా – హోం మంత్రిత్వ శాఖ; సహకార మంత్రిత్వ శాఖ
  4. నితిన్ గడ్కరీ – రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ; రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ
  5. జేపీ నడ్డా – ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
  6. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ; గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
  7. నిర్మలా సీతారామన్ – ఆర్థిక మంత్రిత్వ శాఖ; కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  8. సుబ్రహ్మణ్యం జైశంకర్ – విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  9. మనోహర్ లాల్ ఖట్టర్ – గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ; విద్యుత్ మంత్రిత్వ శాఖ
  10. HD కుమారస్వామి – భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ; ఉక్కు మంత్రిత్వ శాఖ
  11. పీయూష్ గోయల్ – వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  12. ధర్మేంద్ర ప్రధాన్ – విద్యా మంత్రిత్వ శాఖ
  13. జితన్ రామ్ మాంఝీ – సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  14. లాలన్ సింగ్ – పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ; ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
  15. సర్బానంద సోనోవాల్ – ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ
  16. వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
  17. కింజారపు రామ్ మోహన్ నాయుడు – పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
  18. ప్రహ్లాద్ జోషి – వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ; కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
  19. జువల్ ఓరం – గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిరాజ్ సింగ్ – టెక్స్‌ టైల్స్ మంత్రిత్వ శాఖ
  20.  అశ్విని వైష్ణవ్ – రైల్వే మంత్రిత్వ శాఖ; సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ; ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
  21. జ్యోతిరాదిత్య సింధియా – కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ; ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  22. భూపేంద్ర యాదవ్ – పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ
  23.  గజేంద్ర సింగ్ షెకావత్ – పర్యాటక మంత్రిత్వ శాఖ; సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
  24.  అన్నపూర్ణా దేవి – మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
  25.  కిరెన్ రిజిజు – పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ; మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
  26. హర్దీప్ సింగ్ పూరి – పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి
  27.  మన్సుఖ్ మాండవియా – కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ; యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ
  28.  G కిషన్ రెడ్డి – బొగ్గు మంత్రిత్వ శాఖ; గనుల మంత్రిత్వ శాఖ LJP(RV)
  29.  చిరాగ్ పాశ్వాన్ – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
  30.  C R పాటిల్ – జలశక్తి మంత్రిత్వ శాఖ

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)

  1. రావ్ ఇంద్రజిత్ సింగ్ – స్టాటిస్టిక్స్, కార్యక్రమాల అమలు, సాంస్క‌తిక శాఖ
  2. జితేంద్ర సింగ్ – సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, పీఎంఓ ఆఫీస్
  3. అర్జున్ రామ్ మేఘావాల్ – న్యాయం పార్లమెంటరీ వ్యవహారాలు
  4. ప్రతాప్ రావ్ గణపతి రావ్ జాదవ్ – ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
  5. జయంత్ చౌధరి – నైపుణ్యాభివృద్ధి, విద్య, ఎంట్రప్రెన్యూర్

సహాయ మంత్రులు:

  1. జితిన్ ప్రసాద – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
  2. శ్రీపాద యెశో నాయక్ – విద్యుత్తు, నూతన పునరుత్పాదక ఇంధనం
  3. పంకజ్ చౌదరి – ఆర్థికం
  4. కిషన్ పాల్ – సహకారం
  5. రాందాస్ అథవాలే – సామాజిక న్యాయం, సాధికారత
  6. రామ్ నాథ్ ఠాకూర్ – వ్యవసాయ, రైతు సంక్షేమం
  7. నిత్యానంద రాయ్ – హోం శాఖ
  8. అనుప్రియ పటేల్ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు
  9. వి. సోమన్న – జల్ శక్తి, రైల్వే
  10. డా. చంద్రశేఖర్ పెమ్మసాని – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
  11. ప్రొ. ఎస్.పి. సింగ్ బఘేల్ – మత్య్స, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్
  12. శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
  13. కీర్తి వర్ధన్ సింగ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
  14. బి. ఎల్. వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం సాధికారత
  15. శంతను ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్
  16. సురేశ్ గోపి – పెట్రోలియం, సహజ వాయువులు, పర్యాటకం
  17. డా. ఎల్. మురుగన్ – సమాచార ప్రసారాలు, పార్లమెంట్ వ్యవహారాలు
  18. అజయ్ టమ్టా – రోడ్డు రవాణా, హైవేలు
  19. బండి సంజయ్ కుమార్ – హోం శాఖ సహాయ మంత్రి
  20. కమలేశ్ పాశ్వాన్ – గ్రామీణాభివృద్ధి
  21. భగీరథ్ చౌధరి ‌ – వ్యవసాయ, రైతు సంక్షేమం
  22. సతీశ్ చంద్ర దూభే – బొగ్గు, గనులు
  23. సంజయ్ సేఠ్ ‌– రక్షణ
  24. రణ్ వీత్ సింఘ్ – ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
  25. దుర్గాదాస్ ఉయికే – గిరిజన వ్యవహారాలు
  26. రక్షా నిఖిల్ ఖడ్సే – క్రీడలు, యువజన వ్యవహారాలు
  27. సుఖాంత మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
  28. సావిత్రి ఠాకూర్ – మహిళా శిశు సంక్షేమాభివృద్ధి
  29. టోకన్ సాహూ – గృహ నిర్మాణ పట్టణ వ్యవహారా
  30. రాజ్ భూషణ్ చౌదరి – జల్ శక్తి
  31. భూపతి రాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు, ఉక్కు
  32. హర్ష్ మల్హోత్రా – కార్పోరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, హైవే
  33. నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ
  34. మురళీధర్ మొహోల్ – సహకార పౌర విమానయానం
  35. జార్జ్ కురియన్ – మైనారిటీ వ్యవహారాలు, మత్య్స, పశుసంవర్థక డెయిరీ
  36. పవిత్ర మార్గరీటా – విదేశీ వ్యవహారాలు, టెక్స్ టైల్స్

You may also like
blood donation by kbk group
KBK Group ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం!
ktr
చట్నీలో ఎలుక పరుగులు..రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్!
Modi Puthin
ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం.. అందజేసిన పుతిన్!
పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions