Wednesday 13th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘ప్రభాస్ వచ్చాక సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది’

‘ప్రభాస్ వచ్చాక సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళింది’

Manchu Manoj Review On Kannappa | మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ మూవీ శుక్రవారం విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ సినిమాను వీక్షించారు.

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడారు. తాను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు సినిమా బాగుందన్నారు. ‘కన్నప్ప’ సినిమా చాలా చాలా బాగుందని, ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీ నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని మనోజ్ పేర్కొన్నారు.

ప్రతీఒక్క క్యారెక్టర్ చాలా బాగుందని మరీ ముఖ్యంగా క్లిమాక్స్ లో అందరూ అద్భుతంగా యాక్టింగ్ చేశారని కితాబిచ్చారు. మూవీ టీం శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నారు.

ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెట్టిన బడ్జెట్ కు వెయ్యి రెట్లు వసూలు కావాలని కోరుకున్నారు. అలాగే తన తండ్రి మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మూవీలోని కొన్ని సీన్లు తనను భావోద్వేగానికి గురి చేశాయన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions