Wednesday 12th August 2026
12:07:03 PM
Home > తాజా > ‘పునర్విభజన అంశం..స్టాలిన్ వ్యాఖ్యలకు కేటీఆర్ సపోర్ట్’

‘పునర్విభజన అంశం..స్టాలిన్ వ్యాఖ్యలకు కేటీఆర్ సపోర్ట్’

KTR About Delimitation Of Constituencies | కేంద్ర ప్రభుత్వం లోకసభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి.

పునర్విభజన అనేది దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ( Stalin ) కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ పునర్విభజన తో సౌత్ స్టేట్స్ కు అన్యాయం చేయొద్దని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) స్పందించారు.

ఈ మేరకు సీఎం స్టాలిన్ వ్యాఖ్యల్ని పూర్తిగా సమర్ధించారు. ఒకవేళ పునర్విభజన చేయాలనుకుంటే రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశానికి అత్యంత అవసరమైనప్పుడు కుటుంబ నియంత్రణను అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను మీరు శిక్షించలేరని స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా డీలిమిటేషన్ ( Delimitation ) అమలు చేయడం ప్రజాస్వామ్యం మరియు సమాఖ్యవాద స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. కేంద్రం డీలిమిటేషన్ అమలు చేయడానికి ఆసక్తిగా ఉంటే- దేశానికి ఆర్థిక సహకారాల ఆధారంగా డీలిమిటేషన్‌ చేయాలని ప్రతిపాదించారు.

తెలంగాణ మరియు దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణానికి అందించే సహకారాన్ని ఎవరూ విస్మరించలేని విషయం అని గుర్తుచేశారు. తెలంగాణ దేశ జనాభాలో 2.8% మాత్రమే ఉన్నప్పటికీ, దేశ GDPలో 5.2% కంటే ఎక్కువ వాటాను అందిస్తుందన్న విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేశారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions