Saturday 12th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘అదో రియల్ ఎస్టేట్ దందా.. దాన్ని తీసి అవతల పడేస్తాం’

‘అదో రియల్ ఎస్టేట్ దందా.. దాన్ని తీసి అవతల పడేస్తాం’

kcr

KCR comments on HYDRAA | తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా’ (HYDRAA) అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.

సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తొలి సంతకం దానిపైనే..
“మేం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొదటి సంతకం హైడ్రాను తొలగించడం పైనే ఉంటుంది. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు” అని కేసీఆర్ పేర్కొన్నారు. నీడ్రా.. జీడ్రా..

“నిజామాబాద్‌లో నీడ్రా, జగిత్యాలలో జీడ్రా తెస్తామని చెబుతున్నారు. ఇవన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టడానికేనా?” అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో 15 వేల మంది పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసమేనని, భూములను కబ్జా చేసేందుకే ఈ ప్లాన్ అని ఆరోపించారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు మూడున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చానని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇళ్లను కూలగొడుతోందని ధ్వజమెత్తారు. “మూసీ సుందరీకరణ చేయండి.. కానీ పేదల ఇళ్లు కూల్చవద్దు” అని హితవు పలికారు.

హైడ్రా కూల్చివేతలు, మూసీ నిర్వాసితుల అంశంపై కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

You may also like
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
ADR Report: సీఎంల ఆస్తులు, కేసులు.. రేవంత్ టాప్, డీకే నంబర్-1
“కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!
కాళేశ్వరానికి లక్ష కోట్లు.. పాలమూరుకు గుండుసున్నా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions